పర్యాటకంగా మంత్రాలయం ముందడుగు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:18 PM
మంత్రాలయం పర్యాటక రంగ అభివృద్ధికి మరొక ముందడుగు పడింది. రూ.85 కోట్లతో బాపురం గ్రాండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 మంది ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది.
రూ.85 కోట్లతో బాపురం గ్రాండ్ హోటల్‌కు ఒప్పందం
విశాఖ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో నిర్ణయం
మంత్రాలయం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం పర్యాటక రంగ అభివృద్ధికి మరొక ముందడుగు పడింది. రూ.85 కోట్లతో బాపురం గ్రాండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 మంది ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. విశాఖలో శుక్రవారం జరిగిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్- 2026లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, బాపురం హోటల్స్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి ఒప్పంద పత్రాలను అందుకున్నారు. మంత్రాలయం సమీపంలో ఎమ్మిగనూరు రోడ్డులో కల్లుదేకుంట గ్రామం వద్ద ఐటీసీ ఫార్చూన్ హోటల్స్ బ్రాండ్ అనుబంధంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళికలు చేపట్టింది. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. ఈ హోటల్ నిర్మాణం పూర్తయితే మంత్రాలయం దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ రవీంద్రరెడ్డి తెలిపారు.