Share News

సంపద తయారీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించండి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:26 AM

గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు.

సంపద తయారీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించండి
చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ సిరి

గూడూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. శుక్రవారం మండలంలోని కె.నాగలాపురంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు గ్రామంలో సేకరిస్తున్న తడి, పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రొసెసింగ్‌ చేయడం, వర్మీకం పోస్ట్‌ తయారీ, పారి శుధ్య నిర్వహణ అంశాలను కలెక్టర్‌ పరిశీ లించారు. గ్రామంలో 12 వర్మీకంపోస్ట్‌ పిట్ల ద్వారా నాణ్యమైన సేంద్రి య ఎరువును తయారు చేస్తూ, నెలకు రూ.15వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు అధికారు లు కలెక్టర్‌కు వివరించారు. రీ-సర్వేకు సంబంధించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి జ్యాపం లేకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్వర్ణగ్రామ కార్యాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియంవద, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

పోషకాహారంపై అవగాహన కల్పించండి

కోడుమూరు రూరల్‌: బాలింతలు, గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. శుక్రవారం ప్యాల కుర్తిలో ఒకటో అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పిల్లలకు అందుతున్న ఆహారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల హాజరును ప్రతిరోజు పర్యవేక్షించాలని, కేంద్రాల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. బాతరూంను పిల్లలు విని యోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుడ్లు, పాలు, రాగి జావ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఖర్జూరం, చిక్కీపై బాలింతలు, గర్భిణులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. స్టోర్‌ రూం తనిఖీ చేశారు. టేక్‌ హోం రేషన పంపిణీ, ఆనలైన నమోదు, హోం విజిట్స్‌ అంశాలను కలెక్టర్‌ ఆనలైనలో పరిశీలించారు. పిల్లలతో ముచ్చటిస్తూ ఏమి నేర్చుకున్నారని ఆప్యాయంగా పలకరించారు. పిల్లల సంఖ్యలు, ఏబీసీడీలు చక్కగా గుర్తించి చెప్పడంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పీడీ విజయ, ఎంపీడీవో రాముడు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:26 AM