Share News

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:30 PM

ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ అనంతరం వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రీఓపెన్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు నిర్దేశిత గడువు దాటిన అంశంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అఽధికారుల లాగిన్‌లో ఇంకా పరిశీలించని దరఖాస్తులను పరిశీలించి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల ద్వారా అందుతున్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా 343, రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 165 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 11:30 PM