మల్లన్న హుండీ ఆదాయం రూ.7.19 కోట్లు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:41 PM
ఉగాది మహోత్సవాల సందర్బంగా శ్రీశైల మల్లన్న ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు.
శ్రీశైలం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఉగాది మహోత్సవాల సందర్బంగా శ్రీశైల మల్లన్న ఆదిదంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఈ హుండీల ద్వారా రూ.7,19,58,064 నగదు రూపేనా వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మొత్తాన్ని భక్తులు గడిచిన 30 రోజుల్లో స్వామివారికి సమర్పించినవని వెల్లడించారు. నగదుతో పాటు 12.20 తులాల బంగారు, 6.55 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. అదే విధంగా 624 యూఎ్‌సఏ డాలర్లు, 210 యూఏఈ దిర్హమ్స్, 10 సింగపూర్ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 14 మలేషియా రింగెట్స్, 25 ఆస్త్రేలియా డాలర్లు, 70 యూరోస్, 6 సౌదీ రియాల్స్, 60 కెనడా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లు, ఒక కువైట్ దినార్‌తో పాటు వివిధ దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారు. అక్కమహాదేవి కల్యాణ మండపంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ప్రధాన విభాగాల అధికారులు, శివసేవకులు పాల్గొన్నారు.