Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోండి

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:12 PM

మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల టౌన్‌, అక్టోబర్‌ 28(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని వారు ఫారం ఏతో పాటు డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డు, సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సురే శ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:12 PM