Share News

లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:24 PM

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరగబోయే జాతీయ లోక్‌ అదాల త్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు.

లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది

డోన్‌ టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరగబోయే జాతీయ లోక్‌ అదాల త్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు. శుక్రవారం పట్టణంలోని కోర్టులో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందాలని అన్నారు. న్యాయాధికారులు తమ పరిధిలోని పోలీసు, బ్యాంకు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారు లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 కోర్టులు మంజూరు కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 21 అలాగే డోన్‌కు ఒకటి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంజూరైందని తెలిపారు. ఈ సమావేశంలో సబ్‌ కోర్టు న్యాయాధికారి కేవీ రామకృష్ణయ్య, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వినోద్‌, అడిష నల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ సాకే జ్యోతి, డోన్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కే.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:24 PM