Share News

‘న్యాయ సహాయ కేంద్రాలను వినియోగించుకోవాలి’

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:57 PM

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం న్యాయ సహాయ కేంద్రాలను ప్రారంభిస్తు న్నామని, వీటిని వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు సూచించారు.

‘న్యాయ సహాయ కేంద్రాలను వినియోగించుకోవాలి’
ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి వాసు

కర్నూలు లీగల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం న్యాయ సహాయ కేంద్రాలను ప్రారంభిస్తు న్నామని, వీటిని వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు సూచించారు. గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం న్యాయ సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారం భించి మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు రూపొందించిన వివిధ పథకాలను అమలు పరిచేందుకు 60 రోజుల పాటు మెగా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ న్యాయ సహాయం కేంద్రంలో ఒక ప్యానెల్‌ న్యాయవాది, పారా లీగల్‌ వలంటీర్లు సభ్యులుగా ఉండి ప్రజలకు న్యాయ సంబంధమైన సమ స్యలకు ఉచిత న్యాయసలహాలు ఇస్తారన అన్నారు. కార్యక్రమంలో గూడూరు తహసీల్దార్‌ వెంకటేశ నాయక్‌, గూడూరు డిప్యూటీ ఎంపీ డీవో లావణ్య ప్రియ, కోడుమూరు సీఐ తబ్రేజ్‌, గూడూరు ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప, పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ చంద్రకళ, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:57 PM