Share News

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:11 PM

మే 9వ తేదీన జరగ బోయే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి వివిద బ్యాంకు మేనేజర్లను కోరారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి
మాట్లాడుతున్న బి. లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): మే 9వ తేదీన జరగ బోయే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి వివిద బ్యాంకు మేనేజర్లను కోరారు. శుక్రవారం స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు ప్రిలిటిగేషన్‌ కేసుల ను బ్యాంకు డీఫాల్టర్‌ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఈఅవ కాశాన్ని కక్షిదారులు సద్వినియోగించుకొని తమ కేసులను రాజీ మా ర్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. సమావేశంలో నగరంలోని పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:11 PM