Share News

మినీ మహానాడును విజయవంతం చేద్దాం

ABN , Publish Date - May 27 , 2026 | 12:10 AM

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించనున్న మినీ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి కోరారు

మినీ మహానాడును విజయవంతం చేద్దాం
అభిరెడ్డిపల్లె వాసులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించనున్న మినీ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించే మహానాడులో పాల్గొని సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్‌ గోవర్దన్‌ రెడ్డి, కోట్రికే ఫణిరాజ్‌, వలసల రామకృష్ణ, పెద్ద కేశవయ్య గౌడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, జయన్న యాదవ్‌, సలీంద్ర శ్రీనివాసులు యాదవ్‌, ఎల్ల నాగయ్య, శేషఫణిగౌడు, భూమా నాగన్న, గార్లదిన్నె సుదాకర్‌, కొత్తకోట శ్రీను, రంజిత్‌ కిరణ్‌, మిద్దెపల్లి గోవిందు, మహ్మద్‌ రఫీ, చనుగొండ్ల శ్రీరాములు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక..

మండలంలోని అభిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైసిపీ మద్దతుదారులైన 20 కుటుంబాలు టీడీపీ మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, అభిరెడ్డిపల్లె గోవిందు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల, పరిశీలకుడు గోవర్దన్‌ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - May 27 , 2026 | 12:10 AM