మెగా పీటీఎంను విజయవంతం చేయండి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:18 AM
ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని డీఈవో సుధాకర్ అన్నారు. బుధవారం సాయంత్రం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీనివాసులు, పరిమళదేవి, ఉపాధ్యాయులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
కర్నూలు డీఈవో సుధాకర్
కోసిగి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని డీఈవో సుధాకర్ అన్నారు. బుధవారం సాయంత్రం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీనివాసులు, పరిమళదేవి, ఉపాధ్యాయులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగే మెగా పీటీఎంలో భాగంగా మండలంలోని బాలుర, బాలికల జెడ్పీహెచ్‌ఎ్‌సలు, మోడల్ స్కూల్, ఈ మూడింటిలో ఏదో ఒకచోట జిల్లాస్థాయి మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కలెక్టర్ ఏ.సిరి, ఆర్‌జేడీ, టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి పాల్గొంటారన్నారు. మీటింగ్ ఏ పాఠశాలలో నిర్వహిస్తారనే విషయాన్ని గురువారం అధికారికంగా వెల్లడిస్తామని చేశారు. కార్యక్రమంలో ఎంఈవో-2 శ్రీనివాసులు, బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జి.పరిమళదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మెనూ పాటించకపోతే చర్యలు
పెద్దకడబూరు: మెనూ పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో సుధాకర్ అన్నారు. బుధవారం కంబళదిన్నె ఎంపీపీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీరుపై ముద్ద అన్నం..నీళ్లు చారు అనే శీర్షికతో కథనం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన డీఈవో కంబళదిన్నె పాఠశాలను, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ముద్ద అన్నం.. నీళ్లు చారు పెట్టడం ఏమిటని ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయ పాలన పాటించి మంచి విద్య అందించాలని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ భూషణ్, డీఈవో సీసీ నవీన్ రెడ్డి, ఎంఈవో-1 జగదీశ్, ఎంఈవో-2 రాంమూర్తి, కంబళదిన్నె హెచ్‌ఎం శ్రీధర్, మల్లప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.