Share News

సీఎం సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:14 AM

ఈ నెల 9న మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

సీఎం సభను విజయవంతం చేయాలి
సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోట్ల, అధికారులు

ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బేతంచెర్ల, ప్యాపిలి, డోన్‌ మండలాల నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ మండలంలోని కొత్తబురుజు గ్రామంలో పట్టాదార్‌ పాసు పుస్తకాల పంపిణీకి సీఎం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సభా ప్రాంగణంలో పార్కింగ్‌, విద్యుత్‌, తాగునీరు, కుర్చీలు, పోలీసు భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్‌, పట్టణ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, పీఏసీఏసీ చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు, దేవరబండ వెంకటనారాయణ గౌడు, భూమా నాగన్న, ఓబులాపురం శేషిరెడ్డి, పెద్ద కేశవయ్యగౌడు, తదితరులు పాల్గొన్నారు.

హెలిప్యాడ్‌ పరిశీలన..

కొత్తబురుజు గ్రామంలో హెలిప్యాడ్‌, సభా ప్రాంగణం పనులును ఎమ్మెల్యే కోట్లతో, తనయుడు టీడీపీ యువనేత కోట్ల రాఘవేంద్ర రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఆర్డీవో కేపీ నరసింహులు, లక్కసాగరం విజయకుమార్‌ రెడ్డి, గిడ్డారెడ్డి, కొత్తకోట శ్రీను, పీఏసీఎస్‌ చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు, తహసీల్దార్‌ రవికుమార్‌, పీఆర్‌ డీఈ గంగాధర్‌, పీఆర్‌ ఏఈ నారాయణ, సీఐల రాకేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:14 AM