Share News

ప్రజల్లో గౌరవం పెంచేలా పని చేయండి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:23 AM

పోలీసులు ప్రజలలో గౌరవం పెంచేలా పనిచేయాలని ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశించారు.

ప్రజల్లో గౌరవం పెంచేలా పని చేయండి
మొక్కలు నాటుతున్న డీఎస్పీ, సీఐ, పోలీసులు

లీసులకు సూచించిన ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు

సంజామల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పోలీసులు ప్రజలలో గౌరవం పెంచేలా పనిచేయాలని ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, నేరాల వివరాలు, లాకప్‌ గదులు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారిని ఊపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఎస్‌ఐ రమణయ్య, వెంకటేశ్వర్లు, ఓబుల్‌ రెడ్డి, బాషా, మల్కి హుస్సేన్‌, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:23 AM