Share News

జీడీపీ మట్టి కట్టకు మరమ్మతులు చేపట్టాలి

ABN , Publish Date - May 27 , 2026 | 12:15 AM

గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) మట్టి కట్టను ప్రభుత్వం వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టును సీపీఐ నాయకులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్‌ పరిశీలించారు

జీడీపీ మట్టి కట్టకు మరమ్మతులు చేపట్టాలి
దెబ్బతిన్న మట్టి కట్టను చూపుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

గోనెగండ్ల, మే 26(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ) మట్టి కట్టను ప్రభుత్వం వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం గాజులదిన్నె ప్రాజెక్టును సీపీఐ నాయకులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్‌ పరిశీలించారు. గిడ్డయ్య మాట్లాడుతూ 25వేల ఎకరాలకు సాగునీరు దాదాపు 125 గ్రామాలకు తాగునీరు అందించే పశ్చిమ ప్రాంతవాసుల జలజీవ నాడి అయిన జీడీపీ నేడు మట్టికట్ట కోతకు గురై ప్రమాదకర స్థితిలో ఉండటం ఆందోళన కలిగించే విష యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో 4.5 టీఎంసీ సామర్థ్యం నుంచి 5.5 టీఎంసీ సామర్థ్యంకు పెంచేందుకు చేపట్టిన పనులలో కాంట్రాక్టర్‌ నాణ్యత చేపట్టక పోవడం దీనికి తోడు అధికారులు పర్యవేక్షణ లేక పోవడం కారణంగా ప్రాజెక్టు ప్రదాన మట్టి కట్ట కోతకు గురైందన్నారు. ప్రాజెక్టులో జరిగిన నాసిరకం పనులపై కలెక్టర్‌, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల క్రిష్ణమనాయుడికి ఫిర్యాదు చేస్తామని సీపీఐ జిల్లా నాయకులు తెలిపారు. అవసరమైతే ప్రాజెక్టు పరిరక్షణకోసం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్య మాలు చేపడతామన్నారు. మద్దిలేటినా యుడు, మండల కార్యదర్శి శ్రీరాములు, శివరామాంజి, ఏఐటీయూసీ తాలుకా నాయకులు గణేష్‌, రైతు సంఘం నాయకులు మాలిక్‌, యూనుష్‌, నాగప్ప, జయరామ్‌, నల్లారెడ్డి పాల్గొన్నారు.

పరిహారం చెల్లించాలి

ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచడం కారణంగా ఎగువ ప్రాంతం వరద నీటితో ముంపునకు గురై పంట నష్టపోతున్న ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల, గంజహళ్లి, బెల్లందొడ్డి, గ్రామాలకు చెందిన రైతులు పరిహారం ఇవ్వాలని కోరుతూ రైతులు సీపీఐ నాయ కులకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.

Updated Date - May 27 , 2026 | 12:15 AM