Share News

‘సీమ’ను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:44 AM

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అన్నారు. బుధవారం రెడ్డిపల్లె గ్రామంలో రూ.1.17కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, స్కూల్‌ భవనాన్ని ప్రారంభించారు.

‘సీమ’ను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం
రెడ్డిపల్లెలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

డీఎస్సీ-2025పై అపోహలు సృష్టిస్తున్న వైసీపీ

ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

సంజామల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అన్నారు. బుధవారం రెడ్డిపల్లె గ్రామంలో రూ.1.17కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, స్కూల్‌ భవనాన్ని ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అభివృద్ధి చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు సొంత పత్రికలో అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో నాటి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒకేసారి 16వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే 2025 డీఎస్సీపై ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ అమలైతే మన ఆస్తులను కొల్లగొట్టుకపోయే వారిన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎవరి భూములపై వారికే హక్కులను కల్పించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో రెడ్డిపల్లెలో తనకు మెజార్టీ రాకపోయినా రూ.కోట్లు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా సొంత నిధులతో గ్రావెల్‌ రోడ్డు, రైతుల కోసం కల్వర్టులు నిర్మించామ న్నారు. టీడీపీ రాగానే పింఛన్‌ రూ.4వేలకు పెంచామని, ఉచిత గ్యాస్‌, పరిమితి లేకుండా తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుచేశామ న్నారు. ఆల్వకొండ నుంచి పేరుసోముల వరకు రూ7.5కోట్లతో రహదారులు నిర్మించామన్నారు. వేయించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్దిని చూసి ప్రజలు టీడీపీని ఆశీర్వదించాలన్నారు. ఎంపీడీవో సొలమోన్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, డీఈ నాగశ్రీనివాసులు, పశువైద్యుడు కృష్ణకుమార్‌, ఏఈలు రషీద్‌, బాలచంద్రుడు, ఏపీవో ప్రకాష్‌, టీడీపీ నాయకులు విష్ణువర్ధన్‌, బత్తుల ప్రతాప్‌ రెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, కేశవ రెడ్డి, పార్థసాఽరధి రెడ్డి, పేరుసోముల శంకర్‌ రెడ్డి, చిన్న శేఖర్‌ రెడ్డి, నాగిరెడ్డి, మూసాని చంద్రశేఖర్‌ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు మోహన్‌ రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, విష్ణు శేఖర్‌ రెడ్డి, పుల్లారెడ్డి, తిమ్మయ్య, రామగోవింద రెడ్డి, మద్దిలేటి, మల్కి హుస్సేన్‌, మాధవ, బండి ప్రతాప్‌ రెడ్డి, భాస్కర్‌, గాధంశెట్ట రమణయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:44 AM