లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:14 PM
ఆళ్లగడ్డలో మార్చి 14న జరిగే జాతీయ లోక్ ఆదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ఐదో అదనపు న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు. శుక్రవారం పట్టణంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా ఐదో అదనపు న్యాయాధికారి అమ్మన్నరాజా
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలో మార్చి 14న జరిగే జాతీయ లోక్ ఆదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ఐదో అదనపు న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు. శుక్రవారం పట్టణంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏదైనా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ తగాదాల విషయంలో కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కావచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈమేరకు పోలీసులు కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ సివిల్ న్యాయాధికారులు శైలజ, భాస్కర్, ఏపీపీలు శివప్రసాద్‌రావు, సుబ్బయ్య, ఏజీపీకే బాలగురివిరెడ్డి, డీఎస్పీ ప్రమోద్, సీఐలు యుగంధర్, బాబు, రమణ, ఎస్‌ఐలు పీరయ్య, వరప్రసాద్, నగీన పాల్గొన్నారు.