Share News

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:52 PM

నంద్యాలను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు.

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : నంద్యాలను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ ర హదారుల్లో గుర్తించిన బ్లాక్‌ స్పాట్లపై సంబంధిత విభాగాల అధికా రుల తో కలిసి తనిఖీ కోసం నిర్వహించిన బస్సు యా త్రను ఎస్పీ సునీల్‌ షెరాన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహ దారులపై గుర్తించిన బ్లాక్‌ స్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యా ప్తంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 29 బ్లాక్‌ స్పాట్లను అధికా రులు గుర్తించినట్లు చెప్పారు. ఈ బ్లాక్‌ స్పాట్లను త్వరగా సరిదిద్దేందుకు నేషనల్‌ హైవేస్‌, ఆర్‌ అండ్‌ బీ, పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్టీసీ శాఖల మధ్య సమన్వయం పెంచుతున్నట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమా దాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జంక్షన్ల వద్ద వాహ నాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అశోక్‌కుమార్‌, ఆర్‌ఈపీఎల్‌ ప్రాజెక్టు హెడ్‌ మదన్‌ మోహన్‌ వంగర, ఆర్‌ఈపీఎల్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ శ్రీనివాసులు, ఆర్‌ఈపీ ఎల్‌ రూట్‌ మేనేజర్‌ నరియేరవారా రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఎస్పీ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:52 PM