Share News

‘పీఎం స్వనిధి’ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:07 AM

వీధి వ్యాపారలు ఆర్థికంగా రాణించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాసులు పిలుపుని చ్చారు.

‘పీఎం స్వనిధి’ని సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న మెప్మా పీడీ శ్రీనివాసులు

మెప్మా పీడీ శ్రీనివాసులు

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారలు ఆర్థికంగా రాణించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాసులు పిలుపుని చ్చారు. మంగళవారం బాలాభవనలోని మెప్మా కార్యాలయంలో ‘పీఎం స్వనిధి మహోత్సవం’ నిర్వహించారు. పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఆర్థిక స్థిరత్వం కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని కొత్త సదుపాయాలతో ముందుకు తీసుకువస్తుందన్నారు. రూపే క్రెడిట్‌ కార్డు ద్వారా వ్యాపారులకు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు వడ్డీ రహిత క్రెడిట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. రుణాలను సమయానికి చెల్లించిన వారికి అఽధిక పరిమితి పొందే అవకాశం ఉందన్నారు. ఐదేళ్ల కాలప రిమితి కలిగిన ఈ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయం కూడా లభి స్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ పాతబస్తీ చీఫ్‌ మేనేజర్‌ మంగళగౌరీ, కేఎంసీ ఎస్‌బీఐ మేనేజర్‌ సూర్యశివప్రసాద్‌, ఎల్‌హెచ జిలానీ, సీఎంఎం సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:07 AM