Share News

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:22 PM

జిల్లాలో మండల ప్రజా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల ప్రజా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో మండల ప్రజా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికలు 2026 నవంబరు 19వ తేదీన సంబంధిత మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో నవంబరు 14వ తేదీలోపు ఎంపీడీవోలు, ప్రిసైడింగ్‌ అధికారులు మండల ప్రజా పరిషత్‌ సభ్యులందరికీ ఫారం-2 ద్వారా ఎన్నికల నోటీసులను అందజేయాలన్నారు. నోటీసులు అందజేసినట్లు సభ్యుల నుంచి రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నవంబరు 19వ తేదీన ఉదయం 10 గంటలోపు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఫారం-3 ద్వారా నామినేషన్లను స్వీకరించాలన్నారు. నా మినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులకు నిర్దేశిత అర్హతలుండాలని, ప్రతిపాదకులు, బలపరిచే సభ్యులు కూడా సంబంధిత మండల ప్రజా పరిషత్‌ స భ్యులై ఉండాలన్నారు. అభ్యర్థికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలని, మత లేదా భాషా అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన అర్హతను సంబంధిత ధ్రువపత్రాలతో నిర్ధారించుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహించి అనంతరం ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు సమావేశం నిర్వహించి సభ్యులతో ప్రమాణ స్వీకకారం చేయించాలన్నారు. ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో నిబంధనల ప్రకారం చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలన్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు తదుపరి సమావేశం నిర్వహించాలన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:22 PM