పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:16 PM
కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సామగ్రి పంపిణీ, స్వీకరణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అనిల్‌కుమారెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అనిల్‌కుమార్‌రెడ్డి
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సామగ్రి పంపిణీ, స్వీకరణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అనిల్‌కుమారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి అథెనా పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనిల్‌కుమారెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాన్ని కేటాయించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, అధికారుల విధుల నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీసీపీ శభ్నం శాస్త్రి, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు, డీఈలు నరేష్, శ్రీనివాసన్, పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
జడ్పీలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా అబ్జర్వర్ అనిల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. జడ్పీ, ఆవరణలోని మండల కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేశారు. జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.