Share News

పకడ్బందీగా ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:12 PM

ఈనెల 25వ తేదీన సీఎం చంద్రబాబు స్థానిక పీహెచ్‌సీలో ‘సంజీవని’ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా ఏర్పాటు చేయండి

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పీహెచ్‌సీ, బహిరంగ సభా ప్రాంగణం పరిశీలన

ఆస్పరి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఈనెల 25వ తేదీన సీఎం చంద్రబాబు స్థానిక పీహెచ్‌సీలో ‘సంజీవని’ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన డీఎస్పీ వెంకటరామయ్యతో హెలిప్యాడ్‌, కార్యకర్తల సమావేశ ప్రదేశం, బహిరంగ సభా ప్రాంగణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. సీఎం హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యే ప్రదేశం నుంచి రోడ్డు మార్గాన్ని తనిఖీ చేశారు. సభా ప్రాంగణం నుంచి పీహెచ్‌సీకి వెళ్లే మార్గాలను, రోడ్డు మ్యాప్‌ను అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక పోలీసు సిబ్బందికి సూచించారు.ఎస్పీ వెంట సీఐ శ్రీనివాసనాయక్‌, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు కృష్ణయాదవ్‌, మండల కన్వీనర్‌ గోవిందు, రంగనాథ్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:12 PM