Share News

నులిపురుగుల నివారణ దినాన్ని విజయవంతం చేయండి

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:56 PM

నంద్యాల జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం శారదా బాయి పిలుపునిచ్చారు.

నులిపురుగుల నివారణ దినాన్ని విజయవంతం చేయండి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 22, (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం శారదా బాయి పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రైవేట్‌ పాఠశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం శారదా బాయి మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని కోరారు. పిల్లల ఆరోగ్యం, భద్రత విషయంలో పాఠశాలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్‌ కాంతరావు నాయక్‌, డీఈఐసీ సిబ్బంది కలిపి పాఠశాలల ప్రతినిధులకు కార్యక్రమ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డీఈఐసీ సిబ్బంది, ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 10:56 PM