సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:16 AM
జియో మైసూరు కంపెనీ సందర్శనార్థం ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాయలసీమ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశించారు.
రాయలసీమ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
తుగ్గలి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జియో మైసూరు కంపెనీ సందర్శనార్థం ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాయలసీమ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ శివారులో ఉన్న జియో మైసూర్ గోల్డ్ మైన్స్ కంపెనీని ఆయన పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు ఎలాంటి లోటు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంటే వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకట్రామయ్య, రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్‌ఐ మల్లికార్జున, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.