సింహవాహానంపై ఊరేగిన మహానందీశ్వరుడు
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:49 PM
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మహానంది, పిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఆలయంలో వేదపం డితులు, బుత్వీకులు యఽథావిధిగా ప్రత్యేక పూజలు జరిపినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం సింహవాహానంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులు చేశారు. ఆలయ పురవీధుల గుండా భక్తుల శివనామస్మరణ మధ్య గ్రామోత్సవం జరిపారు. రాత్రి శేషవాహాన సేవ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళావేదికలో విజయవాడకు చెందిన రాగ నాట్యలయ చిన్నారులు నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం పలువురిని ఆకటుకున్నాయి. వీరికి ఆలయ ఏఈవో మధు జ్ఞాపికలు అందజేశారు. దేవతామూర్తులకు ఉపయోగించే పట్టు వస్త్రాలను మండల వెలుగు ఏపీఎం తిరుపాల్‌రెడ్డి దంపతులు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డికి అందించారు. ఆలయ వేదపండితుడు రవిశంకర్ అవధాని, అర్చక బృందం పాల్గొన్నారు.