Share News

ప్రారంభమైన మహానాడు

ABN , Publish Date - May 28 , 2026 | 12:27 AM

తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

ప్రారంభమైన మహానాడు
ఆళ్లగడ్డలో భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

డోన్‌, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా నిర్వహణ

వర్చువల్‌గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం విన్న నాయకులు, కార్యకర్తలు

డోన్‌ టౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం, షాధీఖానాలో, ఉడుములపాడు సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం, చిన్న మల్కాపురం గ్రామాల్లో, క్లస్టర్‌, హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు-2026లో పాల్గొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అధినాయకత్వం అండగా ఉంటుందన్నారు. కోట్రికే ఫణిరాజ్‌, టీఈ రాఘవేంద్రగౌడు, గుండాల జయరాముడు, చనుగొండ్ల శ్రీరాములు, అబ్జర్వర్‌ గోవర్దన్‌ రెడ్డి, కొత్తకోట శ్రీను, మల్లెంపల్లె జయన్న యాదవ్‌, రంజిత్‌ కిరణ్‌, మిద్దెపల్లి గోవిందు, దశరథరామిరెడ్డి, అభిరెడ్డిపల్లె గోవిందు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: భవిష్యత్తును నిర్ణయించేందుకే మహానాడు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం రాంలింగారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో వర్చువల్‌ మహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి నివాళి అర్పించారు. నెల్లూరు నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రసంగం విన్నారు. పరిశీలకుడు దేవలపల్లి మురళి, కౌన్సిలర్‌ హుసేన్‌బాషా, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

శిరివెళ్ల: శిరివెళ్ల, యర్రగుంట్ల గ్రామాల్లో క్లస్టర్‌స్థాయి మహానాడుకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. టీడీపీ కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, తెలుగుగంగ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవ కుమార్‌రెడ్డి, సూరా రామ తదితరులు పాల్గొన్నారు.

చాగలమర్రి: చక్రపాణి థియేటర్‌లో క్లస్టర్‌ మహానాడు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. మైనార్టీసెల్‌ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా, కన్వీనర్‌ నరసింహారెడ్డి, బీసీసెల్‌ స్పోక్‌పర్సన్‌ సల్లానాగరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మౌళాలి తెలిపారు.

ప్యాపిలి: నల్లమేకలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావుయాదవ్‌ పాల్గొన్నారు. అలాగే ప్యాపిలి, జలదుర్గం గ్రామాల్లో క్లస్టర్‌ మహానాడును నిర్వహించారు. వై.లక్ష్మినారాయణయాదవ్‌, అలేబాదు పరమేష్‌, ఆర్‌ఈ రాఘవేంద్ర, తిరుపాల్‌నాయుడు, ఆర్‌ఈ నాగరాజు, రాజశేఖర్‌నాయుడు, బట్టాసత్యం, భాస్కర్‌నాయుడు, బాలనరసింహులు, ప్రసాద్‌నాయుడు, శివశంకర, రామానాయుడు, నాగేశ్వరరావు, బట్టారవి, హరిబాబు, జయరాముడు, ప్రసాద్‌, రాంపురం నాగేశ్వరరావు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ: గోల్డెన్‌ ఫంక్షన్‌ హాలులో వర్చువల్‌ మహానాడు నిర్వహించారు. భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, కన్వీనర్‌ బోరెడ్డి శేఖర్‌రెడ్డి, కూడాల నారాయణరెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పేరెడ్డి మోహన్‌రెడ్డి, పల్లె బాబుల్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, కర్నాటి మహేశ్వరరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, అర్జిగారి నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

రుద్రవరం: పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పార్టీ కన్వీనర్‌ ఎల్‌వీ రంగనాయకులు అన్నారు. బుధవారం రుద్రవరం, ఆలమూరు గ్రామాల్లో టీడీపీ క్లస్టర్‌ మహానాడు నిర్వహించారు. రాజారావు, చంద్రశేఖర్‌, చంద్రమోహన్‌, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బనగానపల్లె: పట్టణలో మూడు క్లస్లర్ల పరిధిలో వర్చువల్‌ మహానాడు నిర్వహించారు. మూడు క్లస్టర్‌-1 జీఎంఆర్‌ పంక్షన్‌హాల్‌లో క్లస్టర్‌ ఇన్‌చార్జి గుండం మల్లిఖార్జునరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన్‌ జిల్లెళ్ల రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఉమామహేశ్వరరెడ్డి, కైప రఘునాథరెడ్డి పాల్గొన్నారు. క్లస్టర్‌-2 పరిధిలో క్లస్టర్‌ ఇన్‌చార్జి బురానుద్దీన్‌, టంగుటూరు శ్రీనయ్య, ఆధ్వర్యంలో ఎంఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. క్లస్టర్‌-3 పరిధిలో టంగుటూరు శ్రీనయ్య, అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మహానాడును పట్టణంలోని జీఎ్‌సఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఖాసింబాబు, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, కూరగాయలశేఖర్‌, గడ్డం నాగేశ్వరరెడ్డి, తిరుమలయ్య, భూషన్న, శంఖేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సంగు శంఖేశ్వర్‌రెడ్డి, కైప రఘునాథరెడ్డి, బాలరాజు, వెంకటసుబ్బయ్య, అల్తా్‌పహుసేన్‌, కలాం, సలాం, షబ్బీర్‌, అహ్మద్‌హుసేన్‌, నియాజ్‌, హైదర్‌, వల్లెపుశంకర్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:27 AM