ముగిసిన మహానాడు
ABN , Publish Date - May 29 , 2026 | 12:10 AM
తెలుగు దేశం పార్టీలోనే మహిళలకు పద్దపీట వేశారని, మహానాడులో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం రాంలింగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో రెండో రోజు డిజిటల్ మహానాడు నిర్వహించారు.
రెండో రోజు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా పార్టీ నాయకుల ప్రసంగం
ఆళ్లగడ్డ, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగు దేశం పార్టీలోనే మహిళలకు పద్దపీట వేశారని, మహానాడులో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం రాంలింగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో రెండో రోజు డిజిటల్ మహానాడు నిర్వహించారు. పరిశీలకుడు దేవల్ల మురళి, మున్సిపల్ కౌన్సిలర్ హుసెన్‌బాషా, సుధాకర్‌రెడ్డి, రామశేఖర్‌రెడ్డి, జాఫర్ రెడ్డి, నక్కలదిన్నే శ్రీనివాసులు, సోముల శేఖర్‌రెడ్డి వివిధ ప్రాంతాల కార్యకర్తలు పాల్గొన్నారు.
డోన్ టౌన్: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కోరారు. గురువారం తారకరామ నగర్‌లో టీడీపీ నాయకులు గుండాల జయరాముడు, లారీల బాఽషా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల నివాళులర్పించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అబ్జర్వర్ గోవర్దన్ రెడ్డి, కోట్ల రాఘవేంద్రరెడ్డి నాయకులు, కార్యకర్తలతో నివాళులర్పించారు. కోట్రికే హరికిషన్, దశరథరామిరెడ్డి, ఓబులాపురం శేషిరెడ్డి, టీఈ రాఘవేంద్రగౌడు, భూమా నాగన్న, ఆలేబాదు పరమేష్, జిలేబీ ధను, ఆంజనేయులు గౌడు ఉన్నారు.
రుద్రవరం: టీడీపీ తీర్మానాలు చారిత్రాత్మకమని ఆ పార్టీ కన్వీనర్ ఎల్వీ రంగనాయకులు అన్నారు. గురువారం రుద్రవరంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సందేశాలను విన్నారు. ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు, ఎర్రం ప్రతా్‌పరెడ్డి, పెద్దపుల్లారెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలరాజు, రామనాధరెడ్డి, లక్ష్మికాంత్, నారయణరెడ్డి, శ్రీనివాసులు, రమణగౌడ్, కత్తి బ్రహ్మయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి ఎంఎస్‌ఆర్ కార్యాలయంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఆర్‌ఈ రాఘవేంద్ర, పోలూరు రాఘవరెడ్డి, ప్రజా వైద్యశాల మల్లికార్జున, ఉన్నం చంద్రశేఖర్, గంధం శ్రీనివాసులు, గండికోట రామసుబ్బయ్య, మధుసూదన్‌గౌడు, శేషావలి చౌదరి పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: తెలుగుదేశం పార్టీలో మహిళలకు గుర్తింపు లభించిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్, రాష్ట్ర అడ్మిషన్ సెక్రటరీ పర్వీన్ భాను పేర్కొన్నారు. గురువారం పట్టణంలో వీఆర్‌ఎన్‌ఆర్, పేరా రామసుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న వర్చువల్ మహానాడును పరిశీలించారు. కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, గువ్వల సుబ్బారెడ్డి, కలుగొట్ల అర్జున్ రెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, బిజనవేముల హుస్సేనయ్య, అమడాల మద్దిలేటి, ఏవి సుబ్బారెడ్డి, కంపమల్ల సుబ్బారెడ్డి, అన్నదాత గిరి, లింగాల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె: పట్టణంలో రెండోరోజు గురువారంతో మహానాడు ముగిసంది. పట్టణంలోని కొండపేట జీఎ్‌సఎస్ పంక్షన్‌హాల్‌లో ఇన్‌చార్జి రామిరెడ్డి అమరనాథరెడ్డి, అలాగే ఎంఎస్ పంక్షన్‌హాల్‌లో పరిశీలకురాలు పర్వీన్‌భాను, క్లస్టర్ ఇన్‌చార్జి బురానుద్దీన్, టంగుటూరు శ్రీనయ్య, ఖాసింబాబు, జీఎంఆర్ పంక్షన్ హాల్‌లో క్లస్టర్ ఇంచార్జి గుండం మల్లిఖార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన్ జిల్లెళ్లరాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. తులసిరెడ్డి, బండి మౌళీశ్వర్‌రెడ్డి, కూరగాయలశేఖర్, పవన్‌కుమార్‌రెడ్డి, వంకదారి ప్రసాద్, సంగం శ్రీనివాసరెడ్డి, బొబ్బల మహేశ్వర్‌రెడ్డి, బత్తుల నారాయణరెడ్డి, శంఖేశ్వరరెడ్డి, తిరుమలయ్య, హైదర్, అల్తా్‌పహుసేన్, అహమ్మద్‌హుసేన్, భూషన్న, షేక్షావళి పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులకు టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ భోజన వసతి కల్పించారు. మహానాడును విజయవంతం చేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ కృతజ్ఞతలు తెలిపారు.