కళాహీనంగా మారిన మాధవరం వాగు
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:57 PM
మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో చారిత్రాత్మకమైన వాగు నీరులేక పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కళాహీనంగా మారింది.
పిచ్చి మొక్కలు, కంపచెట్లతో నీటి ప్రవాహంలేని వాగు
మంత్రాలయం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో చారిత్రాత్మకమైన వాగు నీరులేక పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కళాహీనంగా మారింది. ఈవాగు దాదాపు ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలలోని ఆయా గ్రామాల వర్షపు నీటితో తుంగభద్ర నదిలోకి కలిపే ప్రధానమైన వాగు. గతంలో ఈవాగు విశాలంగా ఆహ్లాదకరంగా ఇసుక మేటలతో దర్శనార్థం వచ్చే భక్తులను సైతం ఆకట్టుకునేది. క్రమంగా వాగులో నీటి ప్రవాహం ఉన్నా పిచ్చిమొక్కలు, ముల్లకంపలు, గుర్రెపుడెక్క ఆకులతో నిండి ఉంది. ఈవాగు కింద దాదాపు 40 గ్రామాల నుంచి నీటి ప్రవాహంతో తుంగభద్ర నదిలో కలిపేస్తుంది. జలధార పనుల కింద వాగులో పెరిగిన చెట్లను తొలగించాలని రైతులకు కోరుతున్నారు.