Share News

వైసీపీ శ్రేణులకు భోజనాలు ఏర్పాటు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:03 AM

మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో వైసీపీ కార్యకర్తలు భోజనం చేస్తుండగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు భోజనాన్ని, వంట సామగ్రిని సీజ్‌ చేశారు

వైసీపీ శ్రేణులకు భోజనాలు ఏర్పాటు
పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన సామగ్రి

ప్రజలను ప్రలోభపెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు

గోనెగండ్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో వైసీపీ కార్యకర్తలు భోజనం చేస్తుండగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు భోజనాన్ని, వంట సామగ్రిని సీజ్‌ చేశారు. పెద్దనేలటూరు గ్రామంలో వైసీపీ మద్దతుదారురాలు సర్పంచ్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ వేశారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి పెద్దనేలటూరుతో పాటు మజారా గ్రామమైన చిన్ననేలటూరు నుంచి కూడా వైసీపీ శ్రేణులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చిన వారికి భోజనాలు చేయించారు. భోజనం ఏర్పాటు చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని ఫిర్యాదు అందడంతో పోలీసులు చేరుకొని వంట సామగ్రి, డ్రమ్ములను సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కావడంతో ప్రత్యేక టీమ్‌ మండలంలో పర్యటిస్తోందని, ఫిర్యాదు అందడంతో భోజనాన్ని, సామగ్రిని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించామని చెప్పారు. ఎన్నికల అధికారుల నిర్ణయం మేరకు ముందుకెళ్తామని చెప్పారు.

Updated Date - Nov 19 , 2026 | 12:03 AM