Share News

సామాన్యులకు తప్పని గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:08 AM

ఇరాన్‌పై ఇజ్రయేల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ దొరకక, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్‌ బుక్‌ చేసి, 25 రోజులు గడిచినా సిలిండర్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యులకు తప్పని గ్యాస్‌ కష్టాలు
గ్యాస్‌ ఆటో వద్ద గుమికూడిన వినియోగదారులు

బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్‌కు రూ.2వేల నుంచి రూ 3వేలు

కొలిమిగుండ్ల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై ఇజ్రయేల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ దొరకక, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్‌ బుక్‌ చేసి, 25 రోజులు గడిచినా సిలిండర్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గ్యాస్‌ ఏజెన్సీల ఇష్టారాజ్యంతో తమ కష్టాలు తీవ్రమైనట్లు వాపోతున్నారు. మండలంలో దాదాపు 14500 కనెక్షన్లు ఉన్నాయి.

బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపణలు..

సిలిండర్లను కొందరు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సిలిండర్‌ ప్రస్తుత ధర రూ.వెయ్యిలోపు ఉండగా, దాన్ని రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి చిన్న చిన్న 5 కేజీల సిలిండర్‌లకు గ్యాస్‌ను నింపి, కిలోకు రూ.350 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో రామ్‌ కో, సిమెంట్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ పరిశ్రమల్లో ఇతర రాష్ర్టాల కార్మికులు వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నారు. వారు అధికంగా 5 కిలోల గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తుండటంతో వీరి అవసరాలను గమనించిన కొందరు అక్రమార్కులు కేజీ రూ.350 వరకు అమ్ముతున్నారు. అమ్మకాలు సాగిస్తనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌ ధర రూ.4వేలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తహసీల్దార్‌ సాయి విశ్వతేజను సంప్రదించగా వినియోగదారుల సమస్యలు తీరుస్తామని, ఏజెన్సీలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 29 , 2026 | 12:09 AM