పండుగ పూట గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:44 AM
ఉగాది పండుగ వేళ ప్రజలకు గ్యాస్‌ఇబ్బందులు తప్పలేదు. గురువారం తెల్లవారుజామునే పత్తికొండ బారత్‌గ్యా్‌స ఏజెన్సీవద్దకు వినియోగదారులు ఖాళీసిలిండర్లతో బారులు తీరారు.
పత్తికొండ, మార్చి19 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ వేళ ప్రజలకు గ్యాస్‌ఇబ్బందులు తప్పలేదు. గురువారం తెల్లవారుజామునే పత్తికొండ బారత్‌గ్యా్‌స ఏజెన్సీవద్దకు వినియోగదారులు ఖాళీసిలిండర్లతో బారులు తీరారు. పట్టణంలో కేవలం బారత్‌గ్యా్‌స ఏజెన్సీ మాత్రమే ఉండగా సుమారు 16వేల కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంతోపాటు సమీపగ్రామాల ప్రజల గ్యాస్ అవసరాలకు ఈ ఏజెన్సీనే ఆధారం. పండుగవేళ ఏజెన్సీవద్దకు వచ్చిన వినియోగదారులకు అప్పటికప్పుడు రసీదులు ఇచ్చి సిలిండర్లు పంపిణీ చేశారు. అయితే ఇరాన్-అమెరికా యుద్దంకారణంగా వారంపాటు తమకు గ్యాస్ సిలిండర్లు రాలేదని, దీంతో సుమారు 5 వేల మంది వినియోగదారులకు సరఫరా చేయలేకపోయినట్లు డీలర్ తెలిపారు. బుధ, గురువారాల్లో రెండులోడ్లు రావడంతో సీనియారిటీ ప్రకారం పంపిణీ చేస్తున్నామన్నారు.
బుక్ చేయకున్నా ఇచ్చాం..
గ్యాస్ సిలిండర్ బుక్‌చేయని వినియోగదారులకు కూడా పండుగవేళ వెనక్కు పంపలేక సిలిండర్లు అందించామని డీలరు తెలిపారు. సీనియార్టీ ప్రకారమే ఇస్తామని వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు రెండు రోజులు వరుసగా లోడ్ రావడంతో ప్రస్తుతం పెండింగ్ డెలివరీ 3వేలకు తగ్గిందని,15 రోజులకు సిలిండర్లు సరఫరాచేస్తున్నామన్నారు.
పది రోజులైనా రాలేదు
సిలిండర్ బుక్‌చేసి పదిరోజులైనా రాలేదు, సిలిండర్ అయిపోవడంతో ఏజెన్సీ వద్దకు వచ్చాను. గ్యాస్ కొరత లేకుండా చూడాలి. - నాగరాజు, దూదేకొండ
సీనియారిటీ ప్రకారం ఇస్తున్నాం
బుకింగ్ సీనియారిటీ ప్రకారం సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. సీనియారిటీ లేని వినియోగదారులు కూడా కాలనీల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొందరు గొడవకు వస్తున్నారు. వినియోగదారులు సహకరించాలి. - రంగస్వామి, ఆటోడ్రైవర్