ఆప్యాయతల నడుమ అంగన్‌వాడీ కేంద్రాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:07 AM
అంగన్‌వాడి కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు పిల్లలపట్ల ఆప్యాయత చూపుతారని ఎమ్మెల్యే భూమా ఆఖిలప్రియ అన్నారు. మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడి కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు పిల్లలపట్ల ఆప్యాయత చూపుతారని ఎమ్మెల్యే భూమా ఆఖిలప్రియ అన్నారు. మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో పిల్లల హాజరు జిల్లాలోనే ఎక్కువ అన్నారు. సొంత భవనాలు దాతల సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం టీచర్లు, ఆయాలు, సీపీపీవోను ఎమ్మెల్యే సన్మానించారు. సీడీపీవో తేజశ్వరీ, సూప్రవైజర్లు దస్తగిరమ్మ, పార్వతి పాల్గొన్నారు.
కనీస వేతనాలు అమలు చెయ్యాలి
తమ కనీస వేతనాలు అమలు చేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలని ఎమ్మెల్యే అఖిలప్రియను ఆశా వర్కర్లు కోరారు. మంగళవారం వినతి పత్రాతం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకొని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసానని హామీ ఇచ్చారు.