Share News

నకిలీ మందు పిచికారీతో నష్టపోయా

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:26 AM

మండలంలోని గొడిగనూరులో రెండెకరాల మిరప పంటలో నకిలీ మందు పిచికారీ చేయడంతో పంట ఎదుగుదల లేకుండా వాడి ఎండు దశకు చేరిందని రైతు దేవంద్రనాథ్‌రెడ్డి లబోదిబోమన్నాడు.

నకిలీ మందు పిచికారీతో నష్టపోయా
దెబ్బతిన్న మిరపను పరిశీలిస్తున్న వీహెచ్‌ఏలు

లబోదిబోమంటున్న రైతు

చాగలమర్రి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొడిగనూరులో రెండెకరాల మిరప పంటలో నకిలీ మందు పిచికారీ చేయడంతో పంట ఎదుగుదల లేకుండా వాడి ఎండు దశకు చేరిందని రైతు దేవంద్రనాథ్‌రెడ్డి లబోదిబోమన్నాడు. నెలన్నర క్రితం రెండెకరాల్లో మిరప పంట సాగు చేశానని, రూ.1.5లక్షల వరకు ఖర్చు చేశానని అన్నారు. పంటకు బింగి, పురుగు బెడద నివారణకు ఆళ్లగడ్డలోని పుష్కల్‌ ఆగ్రోటెక్‌ లిమిటెడ్‌లో మందులు కొనుగోలు చేశానన్నారు. దుకాణంలో అఖండ, గోల్డ్‌జమ్‌ మందులను ఇచ్చారని, వాటిని పిచికారి చేసిన మరుసటి రోజే ఉన్న పంట పెరుగుదల తగ్గి కుంగిపోవడం, ఆకులు ముడతలు పడ్డాయన్నారు. దీంతో నకిలీ మందులు ఇవ్వడం వల్లే పంట దెబ్బతిందని కంపెనీ వారిని నిలదీయగా 72 గంటల తరువాత గ్రోత్‌ వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. పంట పరిస్థితిపై రైతు దేవేంద్రనాథ్‌రెడ్డి వీహెచ్‌ఏలు దేవేంద్రనాథ్‌, ఉమామహేశ్వరి దృష్టికి గురువారం తీసుకెళ్లడంతో వారు పంటను పరిశీ లించారు. పంట కుంగిపోవడం, ఎదుగుదల లేకపోవడాన్ని వారు పరిశీలించారు.

Updated Date - Aug 07 , 2026 | 12:26 AM