Share News

అమరావతిలో దోపిడీని అరికట్టాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:51 PM

అమరావతిలో రాజదానికి తాము ఎన్నడు వ్యతిరేకం కాదని, అయితే అక్కడ సీఆర్‌డీఏ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి విమర్శించారు.

అమరావతిలో దోపిడీని అరికట్టాలి
మాట్లాడుతున్న ఎస్వీ మోహనరెడ్డి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): అమరావతిలో రాజదానికి తాము ఎన్నడు వ్యతిరేకం కాదని, అయితే అక్కడ సీఆర్‌డీఏ పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి విమర్శించారు. నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని జగన కోరారన్నారు. పేరు ఏదైనా మూడు ప్రాంతాలలో మూడు హైవేలు కలుస్తాయని ఎస్వీ అన్నారు. అమరావతిలో అడుగుకు రూ.12 వేల రూపాయలు ఖర్చుపెడితే తరువాత సామాన్యులు అడుగుకు రూ.12 వేలు పెట్టి ఎవరైనా ఇళ్లు కట్టుకోగలరా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి, సీనియర్‌ నాయకులు నరసింహులు యాదవ్‌, ఫిరోజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:51 PM