Share News

అయోధ్య రాముడి పేరుతో దోపిడీ

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:40 PM

కేంద్రంలో బీజేపీ నాయకులు అయోధ్య రాముడిని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

అయోధ్య రాముడి పేరుతో దోపిడీ
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

సుప్రీం కోర్టుతో విచారణ జరిపించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

ఎమ్మిగనూరు రూరల్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ నాయకులు అయోధ్య రాముడిని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ జిల్లా జనరల్‌ బాడీ సమావేశాన్ని జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా ఆయనను పట్టణ శివారు ప్రాంతం నుంచి బైకు ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు అయోధ్య రాముడిని సైతం వదలడంలేదని, ఆలయ నిర్మాణం పేరుతో కోట్లు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సెప్టెంబర్‌ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కార్యదర్శి లెనిన్‌బాబు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు నబీ రసూల్‌, మద్దిలేటినాయుడు పాల్గొన్నారు

Updated Date - Jul 04 , 2026 | 11:40 PM