Share News

హాస్టళ్లకు తాళాలు..

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:19 PM

రాయలసీమ యూనివర్సిటీలో వసతి గృహాలకు తాళాలు తీయలేదు. వేసవి సెలవులు ముగించుకుని క్యాంప్‌సలోకి ఒక్కొక్కరే అడుగు పెడుతున్నారు.

హాస్టళ్లకు తాళాలు..
వసతి గృహాలకు వేసిన తాళాలు

ఆర్‌యూలో రూ. కోటి పైనే విద్యార్థుల బకాయిలు పెండింగ్‌..

చెల్లించాల్సిందే అంటున్న అధికారులు

లైబ్రరీలో తలదాచుకుంటున్న విద్యార్థులు

కర్నూలు అర్బన్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో వసతి గృహాలకు తాళాలు తీయలేదు. వేసవి సెలవులు ముగించుకుని క్యాంప్‌సలోకి ఒక్కొక్కరే అడుగు పెడుతున్నారు. కానీ విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి మెస్‌ చార్జీలు తీసుకుంటూ వర్శిటీకి చెల్లించకుండా మొండి చేయి చూపుతూ వస్తున్నారు. దాదాపు 900 మంది బాలురు, బాలికలు గత 3 సంవత్సరాలుగా దాదాపు రూ.కోటి పైనే బకాయిలు పెట్టారని అఽధికారులు అంటున్నారు. రెండే ళ్లుగా బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసినా విద్యార్థులు పట్టించుకోకపోవడంతో అధికారులు సీరియ్‌సగా పరిగణిం చారు. భోజన సదుపాయాల్లో తేడా వస్తే .. గత ఏడాది ఆందోళ నలు చేసి రోడ్డెక్కారు. కానీ బకాయిలను ప్రశ్నిస్తే భోజనం నాణ్య తపై విద్యార్థులు ఎదురు దాడికి దిగడంతో వర్శిటీ అధికారులు ఏమీ చేయలేకపోయేవారు. ఈ నూతన విద్యా సంవత్సరం నుండి పకడ్బందీగా మెస్‌ చార్జీలను వసూలు చేసి నాణ్యమైన భోజన, వసతి గృహ వసతులు కల్పించేందుకు చర్యలు తప్పవని అధికారులు అంటుండగా విద్యార్థులు మాత్రం అధికారుల తీరును తప్పు పడుతున్నారు. ఈనెల 15న వేసవి సెలవులను ముగించుకుని 23 మంది విద్యార్థులు వర్శిటీకి చేరుకున్నారు. మెస్‌ బిల్లులు చెల్లించి వసతి గృహల్లోకి వెళ్లాలనే అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ కొందరు విదార్ధులు లైబ్రరీలో ఉంటు న్నారు. ఈ విషయాన్ని వర్శిటీ రిజిస్ట్రార్‌ బి. విజయ కుమార్‌ నాయుడు వద్ద ప్రస్తావించగా.. విద్యార్థులు ప్రభుత్వం నుండి మెస్‌ చార్జీలు తీసుకుంటూ వర్శిటీకి చెల్లించడం లేదని, వాటిని చెల్లించాల్సిందే అని అన్నామని తెలిపారు. ఇప్పటికైతే 23 మంది విద్యార్థులు మాత్రమే వచ్చారని, బకాయిలు కడితే వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:19 PM