ఉర్దూ పాఠశాలకు తాళం
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:05 AM
మండలంలోని ఓబులంపల్లె గ్రామం ఎంపీపీ పాఠశాల(ఉర్దూ) మూత పడింది. రెండు నెలలుగా పాఠశాలను తెరవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇద్దరు మాత్రమే విద్యార్థులు, పత్తాలేని ఉపాధ్యాయురాలు
ఆళ్లగడ్డ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓబులంపల్లె గ్రామం ఎంపీపీ పాఠశాల(ఉర్దూ) మూత పడింది. రెండు నెలలుగా పాఠశాలను తెరవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే విద్యార్ధులు ఉన్నట్లు రికార్డులో నమోదు చేశారని, ఇక్కడ పనిచేసే ఉపాద్యాయురాలు ఆళ్లగడ్డ నుంచి వచ్చేదని, రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈవో శోభావివేకవతిని వివరణ కోరగా పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.