రైతుసేవా కేంద్రానికి తాళం
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:12 AM
వ్యవసాయ సిబ్బంది విధుల పట్ల తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్లలో బుధవారం 12గంటలకు కూడా రైతుసేవా కేంద్రం తాళం తీయలేదు,
కొలిమిగుండ్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సిబ్బంది విధుల పట్ల తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్లలో బుధవారం 12గంటలకు కూడా రైతుసేవా కేంద్రం తాళం తీయలేదు, ఈ కేంద్రం పరిధిలో మీర్జాపురం, కొలిమిగుండ్ల, బెలుం, బెలుంశింగవరం గ్రామాలున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. పది రోజులుగా తాళం తీయడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి, పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు.