Share News

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:25 AM

మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామంలో వెల్‌నెస్‌ కేంద్రం గురువారం తలుపులు తెరుచుకోలేదు. ఇక్కడ యంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం వీరు విధులకు హాజరుకాలేదు,

ఆసుపత్రికి తాళం.. చెత్త కుప్పలో మందులు
తిప్పారెడ్డిపల్లెలో మూతపడ్డ వెల్‌నెస్‌ కేంద్రంచెత్తకుప్పలో పడేసిన మందులు

తిప్పారెడ్డి వెల్‌నెస్‌ సెంటర్‌ సిబ్బంది ఇష్టారాజ్యం

ఇబ్బందులు పడిన రోగులు

రుద్రవరం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామంలో వెల్‌నెస్‌ కేంద్రం గురువారం తలుపులు తెరుచుకోలేదు. ఇక్కడ యంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం వీరు విధులకు హాజరుకాలేదు, అసలు ఆసుపత్రిని తెరవలేదని తెలుస్తోంది. గ్రామాల రోగులు ఇక్కడికి వచ్చి నిరాశతో వెనుదిరిగారు. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరలేదు. ఈ విషయమై వైద్యాధికారి జయలక్ష్మిని వివరణ కోరగా సిబ్బంది హెచ్‌పీవీ టీకాలు వేసందుకు వెళుతున్నారని వివరించారు.

చెత్తకుప్పకు చేరిన మందులు

అలాగే ఈ ఆసుపత్రిలో రోగులకుం అందాల్సిన మాత్రలు సరిగా పంపిణీ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చిరవకు తేదీ ముగియడంతో చెత్తకుప్పకు చేరాయి. విచారణ చేస్తామని వైద్యాధికారి సెలవిచ్చారు.

Updated Date - Apr 03 , 2026 | 12:25 AM