గోనెగండ్లకు చేరిన ఎల్లెల్సీ నీరు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:18 AM
గోనెగండ్లకు ఎల్లెల్సీ కాలువ ద్వారా గురువారం తెల్లవారుజామున 190క్యూసెక్కుల నీరు చేరాయి.
కోడుమూరుకు 120, జీడీపీకి 40 క్యూసెక్కుల నీరు మళ్లింపు
గోనెగండ్ల, ఏఫ్రిల్ 9(ఆంధ్రజ్యోతి): గోనెగండ్లకు ఎల్లెల్సీ కాలువ ద్వారా గురువారం తెల్లవారుజామున 190క్యూసెక్కుల నీరు చేరాయి. ఈనీటితో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న కుంటలు, చెరువులు, సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లను ఇరిగేషన్ అధికా రులు నీటిని మళ్లించారు. మరో మూడు రోజులలో మండలంలోని పలు కుంటలు, చెరువులు ఎల్లెల్సీ నీటితో కళకళలాడనున్నాయి. గోనెగండ్లకు చేరిన 190 క్యూసెక్కుల్లో కోడుమూరుకు 120, గాజులదిన్నె ప్రాజెక్టులోకి 40 క్యూసెక్కుల నీటిని మళ్లించారు. మిగిలిన నీటిని గోనెగండ్ల, అలువాల ఎస్‌ఎస్ ట్యాంక్‌లకు, తువ్వకుంట చెరవుకు, కులుమాల కుంటకు మళ్లించారు. గోనెగండ్ల ఎస్‌ఎస్ ట్యాంక్‌కు విడుదల అవుతున్న నీటిని ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ విధ్యాసాగర్, ఏఈ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోడుమూరు కు రెండు మూడు రోజులు మళ్లించి మిగిలిన రోజుల్లో నీటిని గాజులదిన్నె ప్రాజెక్టులో నిలువ చేయనున్నట్లు తెలుస్తుంది. జీడీపీలో నిల్వ చేసిన నీరు కోడుమూరులోని పలు గ్రామాలకు అవసర సమయంలో మళ్లించనున్నట్లు సమాచారం. ఎల్లెల్సీ కింద ఉన్న గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వాడు కోవాలని అధికారులు కోరుతున్నారు.