జీవన ప్రమాణాలు పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:28 PM
చెంచులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
చెంచులతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): చెంచులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచు రైతులకు ఉద్యాన పంటలకు సాగుకు అవసరమైన పలు పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. చెంచుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక విధాలుగా తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి చెంచులు వ్యవసాయ రంగంలో రాణించడానికి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఐటీడీఏ పీవో పీవీఎస్ నాయుడు, ప్రాజెక్ట్ మేనేజర్ కేజీ నాయక్, వెలుగు ఏపీడీ నాయక్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రమణయ్య తదితరులు ఉన్నారు.