కర్నూలులో తొలిసారిగా లివర్ మార్పిడీ
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:02 AM
నగరంలో తొలిసారిగా లివర్ మార్పిడీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
గౌరిగోపాల్ హాస్పిటల్‌లో అరుదైన వైద్యం
ప్రజలకు అందుబాటులో అత్యాధునిక సేవలు: మంత్రి టీజీ భరత్
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నగరంలో తొలిసారిగా లివర్ మార్పిడీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్‌లో తొలిసారిగా నిర్వహించిన లివర్ మార్పిడీ, మరో రోగికి కిడ్నీ మార్పిడీ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడంపై మంత్రి కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గౌరి గోపాల్ హాస్పిటల్‌లో టీఎక్స్ హాస్పిటల్ సహకారంతో ఏపీ జీవన్‌ధాన్ ట్రస్టు సమన్వయంతో కర్నూలులో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. కర్నూలులో కొత్త వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో గౌరిగోపాల్ హాస్పిటల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్, 26 ఏళ్ల షేక్ జబీఉల్లాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు రెండు విజయవంతంగా నిర్వహించడంతో పాటు రోగులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. టీఎక్స్ హాస్పిటల్ చైర్మన్ డా.కిర్తకర్ రెడ్డి, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా.భరత్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా.పవన్, ఇంటెలిజెన్సివిస్ట్ డా.హరీష్, డా.ఖాద్రి, సీనియర్ ఫిజీషియన్ డా.మాలకొండయ్య, యురాలజిస్టు డా.జీవీ కృష్ణ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా.సుబ్రహ్మణ్యం, న్యూరోసర్జన్ డా.అనంత్ పాల్గొన్నారు.