Share News

వాటర్‌ షెడ్‌ పథకంతో జీవనోపాఽధి

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:43 PM

వాటర్‌షెడ్‌ పథకంతో గ్రామీణులకు జీవనోపాధి దొరుకుతుందని కలెక్టర్‌ రాజకుమారి, డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు.

వాటర్‌ షెడ్‌ పథకంతో జీవనోపాఽధి
శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, కోట్ల

కలెక్టర్‌ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల

ప్యాపిలి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వాటర్‌షెడ్‌ పథకంతో గ్రామీణులకు జీవనోపాధి దొరుకుతుందని కలెక్టర్‌ రాజకుమారి, డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. మండలంలోని ఎస్‌ రంగాపురం గ్రామంలో నాబార్డు సహకారంతో ఎస్‌ఆర్‌ఈడీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టను న్న వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు పనులకు వారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాటర్‌షెడ్‌ పథకం రైతులకు వరం లాంటిదన్నారు. పథకం వలన భూగర్భ జలాలు పెరిగి సుస్థిర వ్యవసా యానికి దోహద పడతాయని అన్నారు. వాటర్‌షెడ్‌ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచిం చారు. డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అనంతరం మండలంలోని కలచట్ల గ్రామంలో వాటర్‌షెడ్‌ లబ్ధిదారులకు ఎలక్ట్రిక్‌ కూరగాయల విక్రయ యంత్రాలను, రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ కిట్లను, కలెక్టర్‌, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే సౌరశక్తితో పనిచేసే ఆటోమేటిక్‌ బయో రిసోర్స్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తీక్‌, ఎస్‌ఆర్‌ఈడీ సంస్థ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రాకేష్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రాజారేణుక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:43 PM