మద్యం షాపుల లైసెన్స్ ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:55 PM
2026-27 సంవత్సరానికి మద్యం షాపుల మంజూరుకు లాటరీ పద్ధతిలో లైసెన్సీదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది..
15 షాపులకు 62 దరఖాస్తులు
లాటరీ ప్రక్రియలో డీఆర్వో, డీసీ, సూపరింటెండెంట్
కర్నూలు అర్బన్ ,అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): 2026-27 సంవత్సరానికి మద్యం షాపుల మంజూరుకు లాటరీ పద్ధతిలో లైసెన్సీదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు సమక్షంలో 15 షాపులకు 62 మంది దరఖాస్తులకు లక్కీ డిప్ ప్రక్రియను నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ రాజేంద్ర ప్రసాద్ దరఖాస్తుదారుల పేర్లను పిలవగా సూపరింటెండెంట్ అధ్వర్యంలో లక్కీ డిప్‌లో ఎంపికైన వారిని డీఆర్వో ప్రకటించారు. గత నెల 23న జిల్లాలోని 17 మద్యం షాపులకు గజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 15 షాపులకు 62 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో హాలహర్వికి చెందిన ఈడిగ ఆదినారాయణమ్మ, ఓర్వకల్లుకు చెందిన మల్లెల జ్యోతి ఎంపికయ్యారు. లక్కీడ్రాలో విజేతలైన 15 మంది వెంటనే నాలుగవ వంతు ఎక్సైజ్ ఆర్‌ఈటీను, మూడో వంతు పర్మిట్ రూమ్ ఫీజు చెల్లించడానికి బ్యాంకు కౌంటర్‌ను సమావేశ మందిరంలోనే ఏర్పాటు చేయడంతో రుసుము చెల్లించారు. అక్కడే లెన్సింగ్ అథారిటీ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎం. సుధీర్ బాబు రెండు సంవత్సరాల కాలపరిమితికి ప్రొవిజనల్ లైసెన్సు జారీ చేశారు. జిల్లాలో 109 మద్యం షాపుల్లో 107 షాపులకు లెసెన్స్ ప్రక్రియ పూర్తికావడంతో ఎక్సైజ్ శాఖ ఉపిరి పీల్చుకుంది. మరో రెండు షాపులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఎ్‌సలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.