పలకరించిన వర్షం
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:47 PM
మండలంలో శనివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. కొలిమిగుండ్ల, మీర్జాపురం, బెలుం శింగవరం, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, కోరుమానుపల్లె, తదితర గ్రామాలల్లో సుమారు 45 నిమిషాల పాటు వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కొలిమిగుండ్ల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. కొలిమిగుండ్ల, మీర్జాపురం, బెలుం శింగవరం, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, కోరుమానుపల్లె, తదితర గ్రామాలల్లో సుమారు 45 నిమిషాల పాటు వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. కాగా కొన్ని గ్రామాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి పోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే సాగు చేసిన పంటలకు వర్షం ఊపిరిని ఇచ్చిందని రైతులు అంటున్నారు.
బేతంచెర్లలో వర్షం
బేతంచెర్ల: పట్టణంలో శనివారం మధ్యా హ్నం వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఎండాకాలాన్ని తలపించేలా ఉక్కపోత ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందారు.
నేలవాలిన వరి
రుద్రవరం: రుద్రవరంలో శనివారం గాలివాన కురిసింది. దీంతో వరి నేలవాలింది. కొండమాయపల్లె సమీపంలో వెంగన్నమామిడి చెట్టుప్రాంతంలో , పెద్దకంబలూరు మెట్ట సమీపంలో పాలకంకితో ఉన్న వరి నేలవాలిందని రైతులు వాపోయారు.