Share News

పలకరించిన వాన

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:24 AM

: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మండలంలో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులు జలమయం కాగా, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాంగణాలు వర్షపు నీటితో కుంటలా మారాయి

పలకరించిన వాన
ధాన్యంపై నిలిచిన వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులు

చాగలమర్రి, సంజామల, కోవెలకుంట్ల, రుద్రవరం, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్లలో..

తడిసిన మొక్కజొన్న ధాన్యం

చాగలమర్రి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మండలంలో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులు జలమయం కాగా, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాంగణాలు వర్షపు నీటితో కుంటలా మారాయి. కాగా ముత్యాలపాడు, శెట్టివీడు, గొడిగనూరు, చాగలమర్రి రహదారుల్లో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిచి దెబ్బతిందని రైతులు ఆవేదనకు గురయ్యారు. ధాన్యం తడవకుండా పట్టలు కప్పుకునేందుకు ప్రయత్నించారు. నెల నుంచి చినుకు జాడ లేకపోవడంతో అల్లాడుతున్న రైతాంగానికి కురిసిన ఈ వర్షం వాడుముఖం పట్టిన పంటలకు జీవం పోసింది.

సంజామల: దాదాపు రెండు గంటల పాటు వర్షం కురియడంతో అన్నదాతలు హర్షిస్తున్నారు. ఖరీ్‌ఫలో పంటలు సాగుకు నోచుకోక నష్టపోయిన రైతన్నలు రబీ సాగుకు ఎదురు చూస్తున్నారు. అక్టోబరు చివరి నాటికి శనగ చేసేవారు. ఈ వర్షంతో భూమి పదునెక్కిందని, సాగుకు సిద్ధమవుతున్నారు.

కోవెలకుంట్ల: పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. వర్షాలు లేక ఎండుతున్న పంటలకు వర్షం కాస్త ఊరట నిచ్చిందని రైతులు అంటున్నారు. భూమి పదునెక్కడంతో శనగ సాగుకు సిద్ధమవుతున్నారు.

రుద్రవరం: మండలంలో శుక్రవారం చినుకులు రాలాయి. రహదారి, క్రీడామైదానాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోతాయని రైతులు పరుగు తీసి పట్టలు కప్పారు. చేతికందిన పంట తడిచి పోతుందని రైతులు ఆందోళన చెందారు.

ఉయ్యాలవాడ: శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. రైతులు ఆరబెట్టుకున్న మొక్క జొన్న ధాన్యం తడిచిపోయింది. ఽమాయలూరు, అల్లూరు, ఇంజేడు, ఉయ్యాలవాడ, సుద్దమల్ల గ్రామాల్లో వరి, పత్తి, మిరప, శనగ, మినుము, కంది తదితర పంటలకు వర్షంతో ఉపశమనం కలిగింది.

కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల, బెలుం, మీర్జాపురం, బెలుం శింగవరం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే సాగుచేసిన వివిధ రకాల పంటలకు వర్షం ఎంతగానో మేలు చేకూరుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:24 AM