Share News

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:16 PM

మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు అన్నారు.

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం
ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

కొండారెడ్డి బురుజు వద్ద ర్యాలీని ప్రారంభించిన ఈఎస్‌

కర్నూలు అర్బన్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు అన్నారు. శుక్రవారం నగరంలోని కొండరెడ్డి బురుజు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అధికారి రాజశేఖరగౌడ్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ పోలీస్టేషన్‌ నుండి కొండారెడ్డి బురుజు వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వాడకం, వినియోగం, రవాణా చట్టరీత్యా నేరమని ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంపై డ్రగ్స్‌ ఎలా ప్రభావం చూపేదీ వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు చంద్రహాస్‌, రాజేంద్ర ప్రసాద్‌, జయరామ్‌ నాయుడు, ఎస్‌ఐలు, ఈగల్‌ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:16 PM