Share News

ప్రాణాలు విలువైనవి

ABN , Publish Date - May 06 , 2026 | 12:15 AM

ప్రాణాలు విలువైనవని, రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని డోన్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ కోరారు

ప్రాణాలు విలువైనవి
బ్లాక్‌ స్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

డోన్‌ రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలు విలువైనవని, రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని డోన్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై డోన్‌ నుంచి ప్యాపిలి వరకు బ్లాక్‌స్పాట్లను పరిశీలించారు. పట్టణ సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద హైవే నుంచి పరిశీలన యాత్ర ప్రారంభమైంది. డోన్‌ ఆర్టీవో క్రాంతి కుమార్‌, డీఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ వాహనదారులు టాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం ఆర్టీవో క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ డోన్‌ నుంచి ప్యాపిలి వరకు ఏడు బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా రోడ్డు భద్రత కమిటీ సభ్యులతో కలిసి చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా, రూరల్‌ సీఐ సీఎం రాకే్‌షబాబు, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:15 AM