శిథిలావస్థలో గ్రంథాలయం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:20 AM
పాఠకులకు విలువైన సమాచారం అందించే గ్రంథాయాల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరితో నేడు శిథిలావస్థకు చేరాయి. దివంవగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో 39 ఏళ్ల క్రితం 1986లో కొలిమిగుండ్ల తేరు వద్ద గ్రావ చావిడిలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అయితే ఇన్ని సంవత్సరల నుంచి అదే భవనంలో కొనసాగుతుండటం విచారకరం.
కొలిమిగుండ్లలో పాత భవనం.. వర్షం కురిస్తే తడుస్తున్న పుస్తకాలు
ఇబ్బందులు పడుతున్న పాఠకులు
కొలిమిగుండ్ల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పాఠకులకు విలువైన సమాచారం అందించే గ్రంథాయాల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరితో నేడు శిథిలావస్థకు చేరాయి. దివంవగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో 39 ఏళ్ల క్రితం 1986లో కొలిమిగుండ్ల తేరు వద్ద గ్రావ చావిడిలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అయితే ఇన్ని సంవత్సరల నుంచి అదే భవనంలో కొనసాగుతుండటం విచారకరం.
శిథిలావస్థ...
గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరి, గోడలకు పగళ్లు ఏర్పడ్డాయి, అలాగే పైకప్పు కారుతోంది. దీంతో వర్షం కురిసిన సమసయంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు తడిచిపోతున్నాయి. చినుకు పడితే గ్రంథాలయం లోపల, వెలుపల ఎటుచూసిన తేమ, బురద కనిపిస్తోది.
రోజుకు 200మంది పాఠకులు
ఈ గ్రంథాలయానికి రోజుకు 200మంది వరకు పాఠకులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠకులు కూర్చునేందుకు కూడా సరైన వసతి లేదు. కొలిమిగుండ్ల గ్రంథాలయంలో దాదాపు 7వేల పుస్తకాలు ఉన్నాయి. వీటిలో చరిత్రతోపాటు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రూప్స్‌తో పాటు ఇతర పోటీ పరిక్షల మేటీరీయల్‌తో పాటు నవలలు, పురాణాలు, ఇతిహాసాలు, చిన్న పిల్లల కథల పుస్తకాలు, మాస పత్రికలు, వార పత్రికలు కూడా ఉన్నాయి. గ్రంథాలయ అధికారులు నూతన భవనాన్ని నిర్మించి, పుస్తకాలను కాపాడానలి పాఠకులు కోరుతున్నారు.
ఈ విషయమై గ్రంథాలయ అధికారి రాజ మనోహర్ మాట్లాడుతూ ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేయిస్తామని తెలిపారు.