Share News

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , Publish Date - May 29 , 2026 | 12:21 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు కృషి చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

 ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
హుశేనాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ముగిసిన మహానాడు

ఓర్వకల్లు, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు కృషి చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో డిజిటల్‌ వేదికగా మహానాడు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించి, నివాళి అర్పించారు. ముఖ్యఅ తిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జోనల్‌ క్లస్టర్‌ ఇనచార్జి శ్రీనివాసరెడ్డి, పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్‌ చల్లా లక్ష్మీప్రసాద్‌, టీటీడీ బోర్డు సభ్యుడు రాజశేఖర్‌, టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా గౌరు చరిత పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ వివిధ శాఖల మంత్రులు ప్రసంగాలు ఎల్‌ఈడీ స్ర్కీనపై ప్రసంగాలను వీక్షించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధపరి స్థితుల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహానాడు వేడుకలను వర్చువల్‌గా నిర్వహించామన్నారు. ఓర్వకల్లును పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దన్నారు. కార్యక్రమంలో పొదుపులక్ష్మి ఐక్య సంఘం గౌరవ సలహాదారు విజయభారతి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిం దరెడ్డి, మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, ట్రెజరర్‌ మహబూబ్‌ బాషా, మాజీ సర్పంచ జ్యోతి, సింగిల్‌ విండో చైర్మన్లు సుధాకర్‌ రెడ్డి, సుధాకర్‌రావు, నాగేశ్వరరెడ్డి, కేవీ మధు, బజారు, నాగమల్లేష్‌, కాకి దేవేంద్ర, కృష్ణయ్య చౌదరి, రామాం జనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:21 AM