ఆరోగ్యం కోసం విజ్ఞానంతో కలిసి నడుద్దాం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:10 AM
ఆరోగ్యం కోసం విజ్ఞానంతో కలిసి ముందుకు సాగాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు.
డీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వర ప్రసాద్
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం కోసం విజ్ఞానంతో కలిసి ముందుకు సాగాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యోగా, శారీరక శ్రమ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత సరైన పోషకాహారం మొదలగు వాటి వల్ల సమా జంలో ఆరోగ్యంను పెంపొందించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రోగాలు లేకుండా జీవించాలని, ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించ డానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ర్యాలీ డీఎంహె చ్‌వో కార్యాలయం నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యవాల వరకు కొనసాగింది. డీఐవో డా.ఉమా, స్కూల్ హెల్త్ ఆఫీసర్ డా.మహేశ్వర ప్రసాద్, జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ డా. విశ్వేశ్వరరెడ్డి, డెమో ఎన్.ప్రకాష్‌రాజ్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బాబా ఫకృద్దీన్, డిప్యూటీ డెమో షఫీ ఉన్నిసా, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.