పార్టీని బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:37 PM
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందకు ఓ ప్రణాళికతో పని చేద్దామని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుందాం
డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు
కర్నూలు అర్బన్ , డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందకు ఓ ప్రణాళికతో పని చేద్దామని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు. బుధవారం సిటీ అధ్యక్షుడిగా షేక్ జిలానీబాషాతో పాటు క్రాంతినాయుడు బాధ్యతలు స్వీకరిం చారు. అంతకుముందు నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి బైక్ ర్యాలీతో మేళ తాళాల మధ్య కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు మాట్లాడుతూ అధిష్ఠానం, ఏఐసీసీ నాపైన నమ్మకంతో పదవిని కట్టబెట్టారన్నారు. వర్గాలకు అతీతంగా అంద రు కలిసి పని చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతానని అన్నారు. ఎవరూ సొంత అజెండాలు ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం అంతా పనిచేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకునేందుకు పని చేస్తానని, అందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూ చించారు. కార్యక్రమంలో గద్వాల డీసీసీ రాజీవ్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.బతుకన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు, నాయకులు అనంతరత్నం మాదిగ, ఎన్సీ బజారన్న, డివీ సాంబశివుడు, షేక్ ఖజా హుస్సెన్, రాఘవేంద్ర నాయుడు, రాఘవేంద్ర నాయుడు, సూర్యప్రకా్‌షరెడ్డి, నియోజక, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.